CEC మద్దతిచ్చి తప్పు చేశాం: వైఎస్ జగన్ కీల‌క వ్యాఖ్య‌

CEC మద్దతిచ్చి తప్పు చేశాం: వైఎస్ జగన్ కీల‌క వ్యాఖ్య‌

Summarize with AI

కేంద్ర ఎన్నికల సంఘం (CEC), రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నియామక విధానంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఈసీ నియామక బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపి త‌ప్పు చేశామ‌ని, ఇప్పుడు దానికి రిగ్‌రేట్ అవుతున్నామ‌న్నారు. ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉండాలంటే ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో తక్షణమే భారీ మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రధాన అంశాలు
అధికార పక్షమే ఎన్నికల కమిషనర్లను నియమించుకునే విధానానికి నాడు తాము కేంద్రానికి మద్దతు తెలిపిన తప్పు చేశామ‌న్నారు. విద్యార్థులే తమకు నచ్చిన ఎగ్జామినర్‌ను నియమించుకున్నట్లుగా ఈ ప్రక్రియ తయారైంది. నాటి నిర్ణయానికి విచారం వ్య‌క్తం చేస్తున్నామని, ఈ వ్యవస్థోగత దోషాలను తక్షణమే సరిదిద్దాలని పేర్కొన్నారు.

2024 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని, ఆనాడే తాము ఈ విషయాన్ని లేవనెత్తడమే కాకుండా న్యాయస్థానాలను కూడా పలువురు ఆశ్రయించారని గుర్తుచేశారు. అయితే వ్యవస్థల్లో మూలమట్టంగా మార్పులు రానంత వరకు మనం ఏమి చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు.

సిజెఐ నేతృత్వంలోనే నియామకాలు జరగాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI), ప్రధానమంత్రి (PM), మరియు పార్లమెంట్ విపక్ష నేత (LoP)లతో కూడిన స్వతంత్ర కమిటీ మాత్రమే సీఈసీని నియమించాలి. రాష్ట్రంలో కూడా ఏకపక్షంగా ప్రభుత్వం నియమించకుండా.. హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన త్రిసభ్య కమిటీయే నిర్ణయం తీసుకోవాలి.

అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎన్నికల కమిషనర్లుగా కూర్చోబెట్టడం వల్ల ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సడలుతోందని, స్వతంత్ర విభాగాలుగా ఉండాల్సిన కమిషన్లు అధికార పక్షానికి కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని జగన్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment