ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh)సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) విజయవాడలో షెడ్యూల్ను (Election Schedule) విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకటనతోనే రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియామావళి (MCC) (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం మూడు ప్రధాన దశల్లో అర్బన్, రూరల్ లోకల్ బాడీలకు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది.
- షెడ్యూల్ ప్రకారం పూర్తి వివరాలు
- రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీలకు (10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు) మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
- ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.
- 19న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21 తుది గడువు
- అక్టోబర్ 28 పోలింగ్, 30వ తేదీన ఫలితాలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
మండల, జిల్లా పరిషత్కు సంబంధించి రెండు విడతల ప్రక్రియగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఘట్టం జరగనుంది. అక్టోబర్ 19న నోటిఫికేషన్, నవంబర్ 3వ తేదీన పోలింగ్, నవంబర్ 5వ తేదీన ఫలితాలు విడుదల.
- గ్రామ పంచాయతీ ఎన్నికలు
- గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రభుత్వం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ చేపడుతోంది. పంచాయతీ పోలింగ్ ముగిసిన రోజే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.
- తొలి దశ పోలింగ్ నవంబర్ 26, రెండో దశ పోలింగ్ నవంబర్ 29, మూడో దశ పోలింగ్ డిసెంబర్ 2తో ముగుస్తోంది.








