34% హామీకి మంగళం.. బాబు స‌ర్కార్‌పై బీసీల తిరుగుబాటు

34% హామీకి మంగళం.. బాబు స‌ర్కార్‌పై బీసీల తిరుగుబాటు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వెనకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల (BCs Reservations అంశం మళ్లీ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) బీసీలకు ఏకంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government), ఇప్పుడు ఆ మాట తప్పి ఆ వర్గాలను నట్టేట ముంచేసిందనే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. న్యాయపరమైన చిక్కుల పేరుతో మాట మార్చి, గతంలో పక్కనపడేసిన ‘రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్'(Rajiv Ranjan Mishra Commission) నివేదికను ఇప్పుడు తెరపైకి తెచ్చి హడావిడి చేస్తుండటంపై బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

సుప్రీంకోర్టు ఎదురుదెబ్బతో..
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్ర‌బాబు ప్రభుత్వం (Chandrababu Government) జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కొట్టివేయడం, సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించినప్పటికీ కేసు నిల‌వ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ప్రభుత్వ డొల్లతనం బట్టబయలైందంటున్నారు. రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళతామన్న పెద్దపెద్ద మాటలు కోటలు దాటగా, ఆచరణలో మాత్రం బీసీలను తీవ్రంగా వంచించారనే ఆరోపణలు బలపడుతున్నాయి.

మిశ్రా కమిషన్ నివేదిక పేరుతో కాలయాపన
గతంలో ఆగస్టు 14న ప్రభుత్వానికి సమర్పించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక(Rajiv Ranjan Mishra Commission Report) ప్రకారం.. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.42 శాతంగా (2.65 కోట్లకు పైగా) ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 48.84 శాతం, పట్టణ ప్రాంతాల్లో 54.36 శాతంగా బీసీల జనాభా ఉన్నట్లు కమిషన్ స్పష్టంగా తేల్చింది. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు తగిన ప్రాధాన్యం అనే కనీస సూత్రాన్ని విస్మరించి, ప్రభుత్వం ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నివేదికను అడ్డుపెట్టుకుంటోందని విశ్లేషకులు మండిపడుతున్నారు.

34 శాతం గాలికి.. రిజర్వేషన్లలో భారీ కోతలు
ఎన్నికల సమయంలో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు సర్కార్, తాజాగా కేబినెట్ భేటీలో వెల్లడించిన ప్రతిపాదనలు బీసీలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. స్థానిక సంస్థల్లో వివిధ స్థానాలకు కేటాయిస్తున్నట్లు చెబుతున్న శాతాలు పరిశీలిస్తే ప్రభుత్వ మోసం స్పష్టమవుతోంది.

  • పంచాయతీ వార్డు సభ్యులు: 26.73 శాతం
  • సర్పంచ్‌లు: 27.95 శాతం
  • ఎంపీటీసీలు: 25.55 శాతం
  • ఎంపీపీలు, జెడ్పీటీసీలు: 24.60 శాతం
  • జిల్లా పరిషత్ ఛైర్మన్లు: 23.08 శాతం
  • పట్టణ వార్డు సభ్యులు: 32.78 శాతం
  • మున్సిపల్ ఛైర్‌పర్సన్లు: 33.02 శాతం
  • మేయర్లు: 35.29 శాతం

ఈ అరకొర శాతాల కేటాయింపులతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీ ఏవిధంగా అమలవుతుందని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

బీసీల పట్ల బాబు వైఖరి ఇదేనా?
చంద్రబాబు నాయుడు (Chandrababu Government) అధికారంలో ఉన్న ప్రతిసారీ బీసీలకు వెన్నుపోటు పొడవటం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. 2014–19 మధ్య కాలంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించకుండా బీసీ నాయకత్వాన్ని అణగదొక్కారనే అపవాదు మూటగట్టుకున్న చంద్రబాబు.. గతంలోనూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు తెరవెనుక నాటకాలు ఆడారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కూడా ఎన్నికల హామీని తుంగలో తొక్కి, బీసీలను నట్టేట ముంచిన చంద్రబాబు సర్కార్.. ఈ రిజర్వేషన్ల మోసానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment