ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు.. శ్రీలంక ముందు భారత్‌ 170 పరుగుల టార్గెట్‌

ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు.. శ్రీలంక ముందు భారత్‌ 170 పరుగుల టార్గెట్‌

Summarize with AI

ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్‌లో భారత్‌ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 3 బంతుల్లో 7 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. అలాగే సంజూ శాంసన్ 9 బంతుల్లో 7, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశారు.

అయితే భారత ఇన్నింగ్స్‌ను ఇషాన్ కిషన్ ముందుండి నడిపించాడు. 46 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 3 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్‌ 169 పరుగులకు చేరుకుంది. శ్రీలంక బౌలర్లలో సహన్ అరచ్చిగె 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే తరిందు రత్నాయకె 2 వికెట్లు పడగొట్టగా, వనుజ సహన్, లసిత్ క్రూస్‌పుల్లె చెరో వికెట్ సాధించారు. ఇప్పుడు శ్రీలంక 20 ఓవర్లలో 170 పరుగులు చేస్తే ఫైనల్‌కు చేరుతుంది. ఈ సెమీఫైనల్ విజేత ఇప్పటికే ఫైనల్‌లో చోటు దక్కించుకున్న పాకిస్థాన్‌తో స్వర్ణ పతకం కోసం తలపడనుంది. ఒకవేళ ఓడిపోతే బంగ్లాదేశ్ తో కాంస్య పతకం కోసం పోరాడాల్సి వస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment