ధోనీని కెప్టెన్‌ చేయడం బీసీసీఐ బెస్ట్‌ డెసిషన్‌: పాక్‌ మాజీ కెప్టెన్‌

ధోనీని కెప్టెన్‌ చేయడం బీసీసీఐ బెస్ట్‌ డెసిషన్‌: పాక్‌ మాజీ కెప్టెన్‌

Summarize with AI

2007 వన్డే ప్రపంచకప్‌ (2007 ODI World Cup) తర్వాత భారత్‌(India), పాకిస్థాన్‌ (Pakistan) క్రికెట్‌ ప్రయాణాల్లో వచ్చిన మార్పులపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ యూసుఫ్‌ (Mohammad Yousuf) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ తీసుకున్న నిర్ణయాలు టీమిండియా భవిష్యత్తును మార్చాయని ఆయన పేర్కొన్నాడు. ముఖ్యంగా ఎంఎస్‌ ధోనీని (MS Dhoni) కెప్టెన్‌గా నియమించడం బీసీసీఐ(BCCI) తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పాడు.

భారత క్రికెట్‌ విజయాల్లో రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పాత్ర కూడా కీలకమని యూసుఫ్‌ (Yousuf) ప్రశంసించాడు. జూనియర్‌ స్థాయిలో ప్రతిభను గుర్తించి ఆటగాళ్లను తీర్చిదిద్దడం వల్లే భారత్‌కు బలమైన క్రికెట్‌ వ్యవస్థ ఏర్పడిందని పేర్కొన్నాడు. ప్రస్తుత వైట్‌బాల్‌ క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని కొనియాడాడు.

మరోవైపు పాకిస్థాన్‌ క్రికెట్‌లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, తరచూ మార్పులు చేయడం జట్టు పురోగతిపై ప్రభావం చూపిందని యూసుఫ్‌ అభిప్రాయపడ్డాడు. కొంతమంది ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అదనపు కష్టపడటం లేదని, క్రికెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిందేనని సూచించాడు.

సర్ఫరాజ్‌ అహ్మద్‌ను (Sarfraz Ahmed) పక్కన పెట్టిన తర్వాత పాకిస్థాన్‌ క్రికెట్‌లో సమస్యలు పెరిగాయని కూడా యూసుఫ్‌ వ్యాఖ్యానించాడు. ఇక బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) బ్యాటింగ్‌లో కొన్ని సాంకేతిక లోపాలపై తాను గతంలో సూచనలు చేసినప్పటికీ, మార్పులు చేసుకునేందుకు అతను ఆసక్తి చూపలేదని చెప్పాడు. సోషల్‌ మీడియా ఒత్తిడిని కారణంగా చూపడం కంటే ఆటగాళ్లు కోచ్‌ల సూచనలు పాటిస్తూ తమ ఆటను మెరుగుపరుచుకోవాలని యూసుఫ్‌ సూచించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment