పెళ్లి వరకు వెళ్లి వెనక్కి వచ్చా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్

పెళ్లి వరకు వెళ్లి వెనక్కి వచ్చా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్

Summarize with AI

సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె.. పెళ్లికి తాను పూర్తిగా వ్యతిరేకం కాదని చెబుతూనే, గతంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లి చివరి నిమిషంలో ఆ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చినట్లు వెల్లడించారు.

వివాహం అనేది ఇద్దరి మనసుల కలయికగా ఉండాలని, తన స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని కోల్పోయే బంధంగా మాత్రం ఉండకూడదని శ్రుతి హాసన్ స్పష్టం చేశారు. తన జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న గుర్తింపును కేవలం పెళ్లి అనే బంధంతో ముడిపెట్టడం తనకు ఇష్టం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక వివాహాల పేరుతో భారీగా ఖర్చు చేయడంపైనా శ్రుతి హాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పెళ్లిని ఘనంగా చేసుకోవడాన్ని తప్పుపట్టడం లేదని, అయితే ఒక్కరోజు వేడుక కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం కంటే అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం మరింత అర్థవంతంగా ఉంటుందని అన్నారు.

మరోవైపు తనకు భవిష్యత్తులో తల్లిగా మారాలనే కోరిక బలంగా ఉందని చెప్పిన శ్రుతి.. అందుకోసం తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్తులో ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకోవాలనే ఆలోచన కూడా ఉందని వెల్లడించారు. దీంతో శ్రుతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment