అంతరిక్షంలో మొలకెత్తిన అలసంద విత్తనాలు!

అంతరిక్షంలో మొలకెత్తిన అలసంద విత్తనాలు!

ఇస్రో (ISRO) చేప‌ట్టిన ప్ర‌యోగం అద్భుత‌మైన ఘ‌న‌త‌ను సాధించింది. అంతరిక్షంలో అలసంద విత్తనాలు మొలకెత్తాయి. ఈ ఘనత పీఎస్ఎల్‌వీ సీ60 స్పెడెక్స్ మిషన్‌లో భాగంగా అంత‌రిక్షంలోకి పంపిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్(CROPS) అనే పేలోడ్ లో ప్రత్యేక పరిస్థితుల్లో ఉంచిన అలసంద విత్తనాలు మొలకెత్తాయి. ఈ మాడ్యూల్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ద్వారా అభివృద్ధి చేయబడింది.

ISRO హర్షం
ఈ అద్భుతమైన ఘనతపై, ISRO సంతోషం వ్యక్తం చేసింది. ‘అంతరిక్షంలో జీవం మొలకెత్తింది.. త్వరలోనే పత్రాలు వస్తాయి’ అని ISRO తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ట్వీట్ చేసింది. ఇది నిజంగా ఒక గొప్ప అడుగుగా దేశ‌మంతా భావిస్తోంది. ఇస్రో సాధించిన ఈ విజ‌యాన్ని ప్రపంచ దేశాలు గొప్ప‌గా స్వాగతిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment