చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్)పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు HMPV వైరస్‌కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళన చెందవద్దని, ఇది సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలతో కలిగి ఉంటుందని తెలిపింది.
HMPV వైరస్‌ను దూరం పెట్టేందుకు ప్రభుత్వం కొన్ని సులభమైన సూచనలు చేసింది. జలుబు లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. నీటిని పుష్కలంగా తాగాలి. పోషకాహారం తీసుకుంటూ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం, షేక్ హ్యాండ్స్ చేయడం వంటివి చేయకూడదు. మంచి నిద్ర ఉండటం ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, నిర్లక్ష్యం చూపకుండా సూచించిన జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి అని ప్రభుత్వం కోరింది.