బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ దీపికా పదుకొణే, ఆలియా భట్ సరసన మాలీవుడ్ కుట్టీ మమితా బైజు ప్లేస్ సంపాదించుకుంది. ఒకే కాలెండర్ ఇయర్‌లో హ్యాట్రిక్ రూ. 200 కోర్స్ మూవీస్ అందించి వీరి సరసన జాయిన్ అయ్యింది. 2013లో దీపికా నటించిన యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా చిత్రాలు రూ. 200 కోట్లను రాబట్టుకున్నాయి. ఇలాంటి ఫీట్ ఆలియా 2022లో నమోదు చేసింది. గంగూభాయ్ కతియా వాడీ, త్రిబుల్ ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాలు టూ హండ్రెడ్ క్రోర్ వసూళ్లను క్రాస్ చేశాయి.
దీపికా, ఆలియా తర్వాత రేర్ ఫీట్ సాధించి సెన్సేషనల్‌గా మారింది మలయాళ కుట్టీ మమితా బైజు. ప్రేమలుతో ఓవర్ నైట్ యూత్ హార్ట్ థ్రోబ్‌గా మారిన కేరళ బ్యూటీ డ్యూడ్‌తో మరింత చేరువైంది. ఈ ఏడాది సరికొత్త రికార్డ్స్ సృష్టించి సౌత్ ఇండస్ట్రీ మొత్తం చర్చించేలా చేసుకుంది. మమిత నటించిన త్రీ మూవీస్ రెండు వందల కోట్లు కొల్లగొట్టాయి. జన నాయగన్ ఫ్లాపైనా నియర్లీ రూ. 300 క్రోర్ కలెక్ట్ చేసింది. ఇక ఆగస్టులో రిలీజైన రెండు సినిమాలు కూడా ఈ ఫీట్ టచ్ చేశాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ రూ. 240 కోట్లు రాబట్టగా మలయాళ ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్ టూ ఫిల్మ్స్ రూ. 200 కోట్లు క్రాస్ చేసింది. దీంతో హ్యాట్రిక్ రూ. 200 క్రోర్ సాధించిన తొలి సౌత్ హీరోయిన్‌గా మమితా బైజు నిలిచింది. ఈ రెండు కూడా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీలు కావడం విశేషం. ఈ సక్సెస్‌తో మమితా రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. కోటి తీసుకునే భామ రూ. 3 కోట్లు అడుగుతుందట. ఈ హ్యాట్రిక్ హిట్స్ కేరళ కుట్టీకి ప్లెజర్ అయినప్పటికీ నెక్ట్స్ సినిమాలకు ప్రెషర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి ఇదే మ్యాజిక్ అప్ కమింగ్ మూవీస్‌కు వర్కౌట్ అవ్వాలని ఆశిద్దాం.








