ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) అక్షరాస్యత రేటుపై(Literacy Rate) కూటమి ప్రభుత్వం(Coalition Government) ప్రకటించిన గణాంకాలను(Statistics) వైసీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 2024లో 72.6 శాతం నుంచి 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రకటించడంపై జగన్ ప్రశ్నలు సంధించారు. ఎవరిని మభ్యపెట్టడానికి తప్పుడు లెక్కలు చూపుతున్నారని ప్రశ్నించారు. 2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే 82.1 శాతం అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు.
‘82.1 శాతం లెక్క ఎక్కడి నుంచి వచ్చింది?’
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు(Central Government Statistics), కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని NSSO నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన PLFS 2023-24 వార్షిక నివేదికను జగన్ ప్రస్తావించారు. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు నిర్వహించిన సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 7 ఏళ్లు పైబడిన వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా నమోదైందని తెలిపారు. 2018-19లో 69.1 శాతంగా ఉన్న అక్షరాస్యత రేటు 2023-24 నాటికి 72.6 శాతానికి చేరిందన్నారు.
అదేవిధంగా 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు NSSO నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన PLFS క్యాలెండర్ ఇయర్ 2025 వార్షిక నివేదికను కేంద్రం 2026 జూలై 2న విడుదల చేసిందని జగన్ పేర్కొన్నారు. ఆ అధికారిక నివేదిక ప్రకారం ఏపీలో 7 ఏళ్లు పైబడిన వారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమే అని తెలిపారు.
ఈ నేపథ్యంలో 2026లో అక్షరాస్యత రేటు 82.1 శాతానికి పెరిగిందని ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు ఆధారం ఏమిటని జగన్ ప్రశ్నించారు. 2026 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న నమోదు?
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) విద్యార్థుల నమోదు(Student Enrollment) తగ్గుతుండగా.. ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన UDISE గణాంకాలు వెల్లడిస్తున్నాయని జగన్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. అందుకు బదులుగా తప్పుడు గణాంకాలతో గొప్పలు చెప్పుకోవడంపై దృష్టి పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు.
శాఖపై ఎక్కువ శ్రద్ధ పెట్టు లోకేష్
విద్యాశాఖ మంత్రి ‘రెడ్‌బుక్ పాలన’(Red Book Governance)పై సమయం వెచ్చించడం మానుకుని తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిదని జగన్ సూచించారు. విద్యా రంగంలో వాస్తవ పరిస్థితులను సమీక్షించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారిక గణాంకాలకు, ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని వైఎస్ జగన్ విమర్శించారు.
𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026
The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV








‘డీఎస్సీ’లో గట్టిగా ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు