అర్ధరాత్రి తర్వాత భోజనం చేస్తున్నారా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు

అర్ధరాత్రి తర్వాత భోజనం చేస్తున్నారా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Summarize with AI

మన ఆరోగ్యంపై(Health) ఆహారం(Food) మాత్రమే కాకుండా, ఆహారం తీసుకునే సమయం (Meal Timing) కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను(Breakfast ఆలస్యం చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్(Dinner) చేయడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. అమెరికాలో(America) 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించిన పరిశోధకులు, వారి ఆహార సమయాలను మరణాల రికార్డులతో పోల్చారు. ఈ పరిశోధన European Journal of Clinical Nutritionలో ప్రచురితమైంది.

అధ్యయనం ప్రకారం, ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) చేయడం మంచిదని సూచించింది. ఉదయం 8–10 గంటల మధ్య రోజులో తొలి భోజనం చేసేవారిలో మరణించే ప్రమాదం 10 శాతం, 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చేసేవారిలో 19 శాతం, మధ్యాహ్నం 12 తర్వాత చేసేవారిలో 29 శాతం ఎక్కువగా కనిపించింది. అదే విధంగా అర్ధరాత్రి (Midnight) తర్వాత డిన్నర్ చేసే వారిలో మరణించే ప్రమాదం 27 శాతం ఎక్కువగా నమోదైంది. రాత్రి(Night) 8 గంటల సమయంలో చివరి భోజనం చేసేవారిలో మాత్రం ఈ ప్రమాదం తక్కువగా కనిపించింది.

అయితే భోజనం ఆలస్యంగా చేయడం వల్లే ఆయుష్షు (Lifespan) తగ్గుతుందని ఈ అధ్యయనం నిరూపించలేదు. వయసు, బరువు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ధూమపానం, మద్యపానం, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు. అందువల్ల భోజన సమయాలను క్రమబద్ధంగా ఉంచడంతో పాటు, సమతుల్య ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యమని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment