ఒబామా ప్రశంసించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్!

ఒబామా ప్రశంసించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్!

మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మ మరో విజయం సొంతం చేసుకుంది. అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించిన చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ పాయల్ కపాడియా తెరకెక్కించారు.

మలయాళ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు
ఈ సినిమా ముంబై ఆస్ప‌త్రిలో పనిచేసే ఇద్దరు నర్సుల జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ప్రధాన పాత్రల్లో కశ్రుతి, దివ్య అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఈ చిత్రం గ్రాండ్ పిక్స్ అవార్డును గెలుచుకోవడంతో పాటు, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌ను కూడా పొందింది. ఈ సినిమా ప్రేక్షకులకు భావోద్వేగ ప్రయాణాన్ని అందిస్తుంది. ఒబామా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించటం దీని ప్రత్యేకతను మరింత పెంచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment