బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు (Betting Apps Promotions) సంబంధించిన కేసులో హరిహర వీరమల్లు హీరోయిన్, సినీ నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆమెను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణలో భాగంగా నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆయా యాప్స్‌తో ఆమెకు ఉన్న సంబంధం, ప్రమోషనల్ కాంట్రాక్టులు (Promotional Contracts) ఎలా కుదిరాయి? ఎవరి ద్వారా ఒప్పందాలు జరిగాయి? అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు నిధి అగర్వాల్ తీసుకున్న రెమ్యునరేషన్(Remuneration), చెల్లింపుల వివరాలపై (Payment Details) కూడా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ బ్యాంకు ఖాతాల్లోకి జమ అయిన మొత్తాలపై కూడా అధికారులు వివరాలు అడిగినట్లు సమాచారం. ఆయా చెల్లింపులు ఎప్పుడు జరిగాయి? ఏ ఖాతాల నుంచి నగదు బదిలీ అయింది? వాటికి సంబంధించిన పత్రాలు, లావాదేవీల వివరాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ జరిగినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆర్థిక లావాదేవీలను ఈడీ (ED)పరిశీలిస్తున్న నేపథ్యంలో నిధి అగర్వాల్ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు రెండు గంటల విచారణ అనంతరం నిధి అగర్వాల్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లినట్లు సమాచారం. ఈ విచారణలో ఆమె వెల్లడించిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.








