మోదీకి 25 ఏళ్ల ప్రజా సేవా మైలురాయి.. దేశవ్యాప్తంగా భారీ వేడుకలకు బీజేపీ ఫ్లాన్!

మోదీకి 25 ఏళ్ల ప్రజా సేవా మైలురాయి.. దేశవ్యాప్తంగా భారీ వేడుకలకు బీజేపీ ఫ్లాన్!

Summarize with AI

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ప్రజా జీవితంలో 25 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా (Chief Minister of Gujarat) ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. 2026 అక్టోబర్ 7 నాటికి రాజ్యాంగబద్ధమైన ప్రజా పదవిలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని(25-Year Journey) పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ(BJP) సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’(Seva Sankalp Mahotsav) పేరుతో సుమారు 15 రోజుల పాటు ప్రజా సేవ(Public Service), సంక్షేమం(Welfare), సామాజిక కార్యక్రమాలను (Social Activities) నిర్వహించాలని పార్టీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇందులో పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, ఆరోగ్య శిబిరాలు వంటి ప్రజలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ‘నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ’(Narendra Modi’s 25 Years of Public Service) అనే థీమ్‌తో ఫొటో, డిజిటల్ ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆయన రాజకీయ, పాలనా ప్రస్థానాన్ని ప్రజలకు వివరించనున్నారు.

యువతతో (Youth) పాటు సమాజంలోని వివిధ వర్గాలతో ప్రత్యేక సమావేశాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుపరిపాలన, అభివృద్ధి, అంత్యోదయ వంటి అంశాలపై మేధావుల సదస్సులు నిర్వహించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు (Vinod Tawde) అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రతి రాష్ట్రంలో ఏడుగురు సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను సమన్వయం చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఒక రాష్ట్ర మంత్రి, ఒక సంస్థాగత ప్రధాన కార్యదర్శితో పాటు మరో ఐదుగురు నాయకులు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుమారు 13 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన.. 2014లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మే 26న తొలిసారి భారత ప్రధానమంత్రిగా (Prime Minister) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2019లో రెండోసారి, 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 2026 అక్టోబర్ 7న పూర్తికానున్న 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహించనున్న కార్యక్రమాల్లో ‘సేవ, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం’ అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా కాకుండా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే సేవా కార్యక్రమాలతో అనుసంధానించేందుకు పార్టీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment