చిరంజీవి 158వ సినిమాకు టైటిల్ లీక్.. టైటల్ ఫిక్స్ చేశారా?

చిరంజీవి 158వ సినిమాకు టైటిల్ లీక్.. టైటల్ ఫిక్స్ చేశారా?

Summarize with AI

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమాలకు సంబంధించిన టైటిళ్లు లేదా కథాంశాలు అధికారిక ప్రకటన రాకముందే లీక్ కావడం ఇప్పుడు ఓ మినీ ట్రెడిషన్‌గా మారిపోయింది. గతంలో పలు చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన నటించబోయే 158వ చిత్రం(158th Movie) గురించి కూడా నెట్టింట ప్రచారం శరవేగంగా అందుకుంది

మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘కదిరి కాకాజీ’ (Kadiri Kakaji)అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును(Chiranjeevi Birthday) పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్. అంతేకాకుండా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు నిమిషానికి పైగా నిడివి ఉన్న ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను(Special Video Glimpse) కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రతి సినిమా అనౌన్స్‌మెంట్‌కు ముందే ఇలాంటి టైటిల్ లీకులు బయటకు రావడం మెగా అభిమానులకు ఒకవైపు సరదాగా, ఉత్సాహంగా అనిపిస్తోంది. మెగా స్టార్ బర్త్ డే ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఫ్యాన్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆగస్టు 22న వచ్చే గ్లింప్స్ ఈ ‘కదిరి కాకాజీ’ టైటిల్ ప్రచారానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి!

Join WhatsApp

Join Now

Leave a Comment