విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ..

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ..

Summarize with AI

కరుప్పు సూపర్ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సూర్య(Suriya) నెలల గ్యాప్ లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘(Viswanath and Sons) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) తెరకెక్కించిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ ఓవర్సీస్ ఆడియెన్స్ టాక్ (Overseas Audience Talk) ఎలా ఉందంటే

సినిమా ప్రారంభం సుమారు 20 నిమిషాలు స్లో నరేషన్ లో సాగుతుంది. ఎప్పుడైతే కథలోకి వెళ్తుందో అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు సూపర్బ్ ఫిల్ (Superb Feel) ఇస్తుంది. కథలోకి వెళ్లేకొద్దీ ఆకట్టుకుంటుంది. ప్రథమార్థం పూర్తిగా కథాంశం చుట్టూనే సాగుతూ, మంచి కామెడీ మరియు ఎమోషన్స్‌తో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి భాగం మాంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ కూడా డీసెంట్ గా నీట్ ఉంటుంది, ఒక చక్కటి క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. అయితే అనవసరమైన సబ్-ప్లాట్స్, మెలోడ్రామా కాస్త ఎక్కువైన ఫిలింగ్ కలుగుతుంది. అక్కడకక్కడ సాగతీసినట్టు అనిపిస్తుంది. రన్ టైమ్ కాస్త తగ్గించి ఉంటె ఇంకా బాగుండేది.

సూర్య తన వయసుకు తగ్గ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. ఒక కీలకమైన భావోద్వేగ సన్నివేశంలో సూర్య యాక్టింగ్ కు ఆడియెన్స్ నుండి క్లాప్స్ పడతాయి. రాధిక, మమిత నటనతో అదరగొట్టారు. వెంకీ అట్లూరి మాటలు ఈ సినిమాకి అతిపెద్ద బలం. సంభాషణలు చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. రెండో సగంలో మరిన్ని మంచి సన్నివేశాలు రాసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ఏదేమైనా, ఎక్కడా అసభ్యత లేని ఒక ‘క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’గా ఈ వారాంతంలో ఫ్యామిలీతో ఆస్వాదించదగిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సూర్య ఖాతాలో మరో హిట్.

Join WhatsApp

Join Now

Leave a Comment