‘అమేచ్యూరీష్’.. మెగా వర్సెస్ నందమూరి సోషల్ వార్

‘అమేచ్యూరీష్’.. మెగా వర్సెస్ నందమూరి సోషల్ వార్

Summarize with AI

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju)చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయ, సినీ వివాదం నెలకొంది. సినిమాలో కమేడియన్ సత్య (Comedian Satya)చేత చెప్పించిన ఒక డైలాగ్, దాని చుట్టూ సాగిన హావభావాలు సీనియర్ ఎన్టీఆర్‌ను(Senior NTR) అవమానించేలా ఉన్నాయని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. దానికి ప్రతిగా మెగా ఫ్యాన్స్(Mega Fans), జనసేన శ్రేణులు (Jana Sena Cadre) కౌంటర్లు ఇవ్వడంతో ఈ రచ్చ కాస్తా పొలిటికల్ కలర్ త‌గిలించుకొని టీడీపీ వర్సెస్ జనసేన ఫ్యాన్స్ వార్‌గా మారింది.

వివాదానికి అసలు కారణం ఏంటి?
1978లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ మూవీ ‘యుగపురుషుడు’లోని(Yugapurushudu) ఒక కరాటే ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ “మీ షాట్ / స్ట్రోక్స్ చాలా అమేచ్యూరీష్ (Amateurish) గా ఉంది” అని ఒక ఇంగ్లీష్ పదాన్ని ప్రత్యేకమైన శైలిలో పలుకుతారు. ఇటీవల ఈ పాత క్లిప్ నెట్టింట మీమ్ మెటీరియల్‌గా బాగా వైరల్ అయ్యింది.

‘కొరియన్ కనకరాజు’ చిత్రంలోని ఒక ఫైట్ ఎపిసోడ్‌లో, కొరియన్ వ్యక్తులు దాడి చేస్తున్నప్పుడు కమేడియన్ సత్య ఇదే ‘అమేచ్యూరీష్’ డైలాగ్‌ను సీనియర్ ఎన్టీఆర్ మార్క్ హావభావాలతో రీ-క్రియేట్ చేస్తూ కామెడీ పండించారు. థియేటర్లలో ఈ సీన్ నవ్వులు పూయించినప్పటికీ, నందమూరి అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

సీనియర్ ఎన్టీఆర్ శైలిని చౌకబారు కామెడీ కోసం వాడి అవమానించారని నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. తక్షణమే ఆ వివాదాస్పద సన్నివేశాన్ని ‘కొరియన్ కనకరాజు’ సినిమా నుంచి తొలగించాలని, చిత్రబృందం బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీలపై(Merlapaka Gandhi) హ్యాష్‌ట్యాగ్‌లతో విమర్శల దాడి ప్రారంభించారు.

నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Fans)విమర్శలపై మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అంతే ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మీమ్స్, ఐకానిక్ డైలాగ్స్‌ను సినిమాల్లో కామెడీ కోసం వాడటం సర్వసాధారణమని, దీనికి ‘అవమానం’ అని రంగు పులమడం సరికాదని మెగా ఫ్యాన్స్ వాదిస్తున్నారు. కేవలం మెగా హీరో సినిమా అనగానే గ‌తంలో లేని అభ్యంత‌రం ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తూ నందమూరి హీరోల పాత సీన్లతో కౌంటర్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ – జనసేన (TDP-Jana Sena) పార్టీలు పొత్తులో ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్య జరిగే ఈ వార్.. రాజకీయ రంగులు పులుముకొని కూటమికి ఇబ్బందికరంగా మారుతోంది. సాధారణ సినీ ట్రోల్‌గా మొదలైన ఈ ‘అమేచ్యూరీష్’ రచ్చ.. టిడిపి-జనసేన క్యాడర్ మధ్య వైషమ్యాలకు దారితీస్తుండటంతో, ఇరు పార్టీల నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment