మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, క్లాసీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పేరు ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’(Dominic and The Ladies Purse)గా నిర్ణయించబడింది. ఇందులో గోకుల్ సురేష్, లీనా, సిద్ధికి, విజయ్ బాబు, విజి వెంకటేష్ వంటి అగ్ర కథానాయకులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా దుల్కర్ సల్మాన్ ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. తాజాగా, నూతన సంవత్సరం సందర్భంగా మమ్ముట్టి ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ సినిమా జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో మమ్ముట్టి షట్టర్ ఓపెన్ చేసి కింద చూస్తూ కనిపిస్తున్నారు. ఆయన ముందు ఒక లేడీస్ పర్స్, ఓల్డ్ నోకియా ఫోన్, బైనాక్యులర్, సిమ్ కార్డు, పెన్ను, భూతద్దం ఉన్నాయి. షట్టర్ వెనుక పిల్లి కూడా కనిపిస్తుంది. ఆ పిల్లి అడుగులు షట్టర్ లోపల కూడా కనపడతాయి. ఈ పోస్టర్‌లో ఈ వస్తువులకు, పిల్లికి హీరోకు ఏమైన సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రేక్షకుల్లో భారీగా క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే జనవరి 23 వరకు వేచిచూడాలి.