లావుగా (Overweight) ఉన్న తనను స్లిమ్‌గా (Slim) మారుస్తానని నమ్మించి మిల్క్‌షేక్‌లో(Milkshake) మత్తు మందు (Sedative) ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక జిమ్ ట్రైనర్‌పై (Gym Trainer) ప్రైవేట్ స్కూల్ టీచర్ (Private School Teacher) ఫిర్యాదు చేసింది. విజయవాడ (Vijayawada) సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో (Satyanarayanapuram Police Station) ఫిర్యాదు చేసిన బాధితురాలు.. సంచలన విషయాలను బయటపెట్టింది.
విజయవాడలోని (Vijayawada) ఓ స్కూల్‌లో ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్న సదరు యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌తో (Abdul Khader) పరిచయం ఏర్పడింది. కాస్త లావుగా ఉన్న బాధితురాలిని స్లిమ్‌గా మార్చేందుకు జిమ్ చిట్కాలు, సలహాలు ఇస్తూ అబ్దుల్ ఖాదర్ ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నాడు.
బరువు తగ్గడానికి మిల్క్ షేక్ తాగాలంటూ యువతిని ఒక ప్రైవేట్ హోటల్‌కు తీసుకెళ్లి, అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని బాధితురాలు ఆరోపించారు. ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడి, ప్రైవేట్ ఫోటోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఆరోపణల ఆధారంగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ ఖాదర్ (Abdul Khader) కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.








