ఫార్ములా -ఈ కేసు ఒక ‘లొట్ట‌పీసు కేసు’.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫార్ములా -ఈ కేసు ఒక 'లొట్ట‌పీసు కేసు'.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసులో ప‌స‌లేద‌ని, అదొక లొట్ట‌పీసు కేసు అని కొట్టిపారేశారు. రేవంత్‌రెడ్డి త‌న‌ను ఏదో విధంగా అరెస్టు చేయించి జైలుకు పంపించాల‌ని కుట్ర‌లు ప‌న్నుతున్నాడ‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

ఫార్ములా – ఈ రేసులో అవినీతే లేన‌ప్పుడు కేసు ఎక్క‌డిదన్నారు కేటీఆర్‌. 7న ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుపై త‌మ త‌ర‌ఫు లాయ‌ర్లు నిర్ణ‌యిస్తారని చెప్పారు. మాకు న్యాయ‌స్థానాల‌పై న‌మ్మ‌కం ఉందన్నారు. ఫార్ములా-ఈ కేసు ఒక లొట్ట‌పీసు కేసు అని కొట్టిపారేశారు. త‌నపై ఇది ఆరో ప్ర‌య‌త్నమ‌ని, రేవంత్‌కు ఏమీ దొర‌క‌డం లేదన్నారు. హైకోర్టులో జ‌డ్జి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఏజీ ద‌గ్గ‌ర స‌మాధానం లేదని, త‌న‌పై కేసు పెడితే రేవంత్‌పై కూడా కేసు పెట్టాల‌న్నారు. త‌న‌ను ఏదో ర‌కంగా జైలుకు పంపించాల‌ని రేవంత్ కుట్ర ప‌న్నుతున్నాడని, ఫార్ములా- ఈ రేస్ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జ‌ర‌గలేదన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ త‌ప్పు కేసులో ప‌స‌లేదన్నారు.

కేసీఆర్ ప్ర‌జ‌ల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వ‌స్తారని కేటీఆర్ బ‌దులిచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై సంక్రాంతి త‌రువాత సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు.

ఈ సంవ‌త్స‌రం ఉప ఎన్నిక‌లు రావొచ్చని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆర్ఆర్ఆర్‌లో రూ.12వేల కోట్ల కుంభ‌కోణం జ‌ర‌గ‌బోతోంద‌ని ఆరోపించారు. ఢిల్లీకి వేల‌కోట్ల రూపాయ‌ల సంచులు వెళ్తున్నాయని, పెద్ద కాంట్రాక్ట‌ర్ల వ‌ద్ద నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసి కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

ఫార్ములా–ఈ కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను తుది తీర్పు వెల్లడించేవరకు అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. డిసెంబర్ 31 వరకు ఉన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, తదుపరి విచారణలో మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment