72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. స‌త్తా చాటిన తెలుగు సినిమా

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. స‌త్తా చాటిన తెలుగు సినిమా

Summarize with AI

భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు-2024ను (72nd National Film Awards-2024) కేంద్ర ప్రభుత్వం (Central Government) అధికారికంగా ప్రకటించింది. మొత్తం 34 భాషలకు చెందిన 400 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమాలు (Telugu Movies) కూడా పలు విభాగాల్లో సత్తా చాటాయి.

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ‘ఆర్టికల్ 370’ (Article 370) ఎంపిక కాగా, ఆ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ (Yami Gautam) ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ‘చందు ఛాంపియన్’ (Chandu Champion) చిత్రానికి కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

ఇక ఉత్తమ దర్శకుడిగా ‘అమరన్'(Amaran) చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (Best Popular Film)గా ‘కల్కి 2898 AD’ నిలిచింది.

తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా ‘కమిటీ కుర్రోళ్లు'(Committee Kurrollu) ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఇదే చిత్రానికి రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు కూడా లభించింది.

అలాగే ‘పుష్ప 2′(Pushpa 2)చిత్రానికి దీపాలే నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా, సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఎంపికయ్యారు. ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD) చిత్రానికి నితిన్ జీహాన్ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును అందుకోనున్నారు.

‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) చిత్రానికి అట్లూరి వెంకీ ఉత్తమ స్క్రీన్‌ప్లే & డైలాగ్ రైటర్‌గా ఎంపికయ్యారు. ‘అమరన్’ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కించుకున్నారు.

ఇక ఉత్తమ బాలల చిత్రంగా ‘చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) ఎంపిక కాగా, ఆ చిత్ర దర్శకుడు నందకిషోర్ ఈమని ప్రశంసలు అందుకున్నారు. ఇదే చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యారు.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధాన విజేతలు
ఉత్తమ తెలుగు చిత్రం – కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ మేకప్‌ – పి.రవికుమార్‌ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డైలాగ్ రైటర్‌ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌ (ఒరిజనల్‌) – సుకుమార్‌ (పుష్ప-2)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – దీపాలి నూర్‌, శీతల్ శర్మ (పుష్ప-2)
ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు
ఉత్తమ పాపులర్ చిత్రం – కల్కి 2798 ఏడీ
అవార్డులు లైవ్‌ 44
ఉత్తమ చిత్రం – ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు – మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌ (సంయుక్తంగా)
ఉత్తమ నటి – యామీ గౌతమ్‌ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్‌)
ఉత్తమ నేపథ్య గాయని – వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అభయ్ జోధ్ పుర్కర్‌
బెస్ట్ సినిమాటోగ్రఫర్ – జలాల్‌ (భ్రమయుగం)
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం – కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం)
అవార్డులు లైవ్‌ 33
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌ – నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)
బెస్ట్ ఎడిటర్ – కలైవన్నన్‌ (అమరన్)
బెస్ట్ సౌండ్ డిజైనర్‌ – మానస్ చౌదరి (భూల్ బులియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌ – యోగేశ్ దేశ్‌పాండే
ఉత్తమ పాటల రచయిత – మనోజ్‌ ముంతాసిర్ (మైదాన్‌)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ – జీవీ ప్రకాశ్ కుమార్‌ (అమరన్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – శశ్వంత్ సచ్‌దేవ్‌ (ఆర్టికల్ 370)
అవార్డులు లైవ్‌ 22
ఉత్తమ తమిళ చిత్రం – రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం – ఫెమినిస్ట్ ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం – మిథ్య (ఇల్యూజన్‌)
ఉత్తమ హిందీ చిత్రం – శ్రీకాంత్
ఉత్తమ గుజరాత్‌ చిత్రం – మారన్ (ద హంట్‌)
ఉత్తమ బెంగాలీ చిత్రం – చల్‌చిత్ర ఎఖో
అవార్డులు లైవ్‌ 11
బెస్ట్ ఫిల్మ్‌ క్రిటిక్‌ – సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత – ప్రదీప్‌కుమార్ శెట్టి (కన్నడ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్‌ మెన్షన్‌ – ద చోలా డోరా ఔర్‌ సూయి
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్‌ మెన్షన్‌ – భద్రకాళి నాటకం
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ స్క్రిప్ట్‌ – ఓబుర్‌
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ సినిమాటోగ్రఫీ – లైవ్‌ ఇన్ లూమ్‌
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డైరెక్షన్‌ – ఆనంద్‌ రాయ్‌ (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డాక్యుమెంటరీ – రామ్‌ నమీ
స్పెషల్ మెన్షన్‌ – మేయళగన్‌ (తమిళం)
స్పెషల్ మెన్షన్‌ – తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్‌ (ధనుష్‌)

Join WhatsApp

Join Now

Leave a Comment