రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ, ప్రధానమంత్రి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పాటించాలని క్యాబినెట్ సమావేశాల్లో (Cabinet Meetings) మంత్రులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu).. తన సొంత అవసరాల కోసం మాత్రం కోట్లలో నిధులు కుమ్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే చంద్రబాబు కాన్వాయ్ (Chandrababu Convoy) వాహనాల(Vehicles) కోసం ఏకంగా రూ. 18.66 కోట్లు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం (Alliance Government) మూడు వేర్వేరు జీవోలు (GOs) జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గడిచిన నెల రోజుల్లోనే సీఎం భద్రత, కాన్వాయ్ వాహనాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 28.30 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
చంద్రబాబు కాన్వాయ్‌లోకి సరికొత్త లగ్జరీ(Luxury), భద్రతా (Security) వాహనాలను చేర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిధులను మంజూరు చేసింది. 3 సరికొత్త అత్యాధునిక జామర్ వాహనాల కోసం రూ. 12.28 కోట్లు, మరో 3 జామర్ వాహనాల కొనుగోలుకు రూ. 3.74 కోట్లు, భద్రత అవసరాల కోసం 6 సరికొత్త ఫార్చూనర్ లగ్జరీ వాహనాల కొనుగోలుకు రూ. 2.64 కోట్లు కేటాయిస్తూ జీవోలు జారీ చేశారు.
దీనికి తోడు, గత నెల (జూన్) లోనూ రెండు జామర్ వాహనాలు (Jammer Vehicles) సహా ఇతర సెక్యూరిటీ వాహనాల కొనుగోలుకు రూ. 9.60 కోట్లు విడుదల చేశారు. అంటే కేవలం 30 రోజుల్లోనే చంద్రబాబు కాన్వాయ్ వాహనాల కోసం ప్రభుత్వం రూ. 28.30 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించింది.
కొద్ది రోజుల క్రితం ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపు మేరకు చంద్రబాబు తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను 12 నుంచి 4కు తగ్గించుకున్నారంటూ అనుకూల మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. రాష్ట్ర మంత్రులు కూడా తమ వాహనాల సంఖ్యను కుదించుకోవాలని, పొదుపు పాటించాలని చంద్రబాబు సూచనలు చేశారు.
అయితే, ఒకవైపు పొదుపు చేస్తున్నామంటూ ప్రకటనలు ఇస్తూనే.. మరోవైపు సరికొత్త లగ్జరీ ఫార్చూనర్ కార్లు, కోట్ల విలువైన జామర్ వాహనాలకు జీవోల మీద జీవోలు జారీ చేయడం వెనుక ఆంతర్యమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని, జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నామని పదే పదే చెప్తున్న పాలకులు.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని లగ్జరీ వాహనాల కోసం రూ. 28 కోట్లకు పైగా క్షణాల్లో ఎలా విడుదల చేస్తున్నారనేది సామాన్య ప్రజల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. ఇప్పటికైనా ఈ ఆడంబరాల ఖర్చులకు చెక్ పెట్టి ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.








