కొత్త ఏడాది.. తొలి కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు

కొత్త ఏడాది.. తొలి కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీ దేశవ్యాప్తంగా రైతులు, నిరుద్యోగులు, పలు కీలక ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకోన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం మరియు రైతుల సంక్షేమంపై చర్చ జ‌రగనున‌ట్లు సమాచారం. రైతులకు గుడ్ న్యూస్ అందిస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా రైతులకు ఇచ్చే నిధులను రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచే నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కీలక ప్రాజెక్టులకు ఆమోదం
దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం ఇవ్వబడే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఉద్యోగాల కల్పనకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కొత్త ఏడాది శుభాకాంక్షలు
ప్రధాని మోదీ తన ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరికీ కొత్త అవకాశాలతో పాటు విజయాలు, ఆనందం తీసుకురావాలి అని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment