షాబాద్‌లో నరమేధం.. 2 గంటల్లో ఆరుగురిని చంపిన ఉన్మాది

షాబాద్‌లో నరమేధం.. 2 గంటల్లో ఆరుగురిని చంపిన ఉన్మాది

Summarize with AI

తెలంగాణలో(Telangana) అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. పోక్సో కేసులో(POCSO Case)బెయిల్(Bail) మీద వచ్చిన నిందితుడు కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒకే వ్యక్తి ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) షాబాద్ (Shabad) పరిధిలోని దైవాలగూడలో రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు ఈ నరమేధం కొనసాగిందని తెలంగాణ పోలీసులు (Telangana Police) వెల్లడించారు. నిందితుడు రాజ్‌కుమార్(28)గా (Raj Kumar) గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్(28) అనే వ్యక్తిపై మే 16వ తేదీన బాధితురాలి తల్లి(Mother) ఫిర్యాదు చేసింది. మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించగా, ఇటీవల బెయిల్‌పై రాజ్ కుమార్‌(Raj Kumar) తిరిగి వచ్చాడు. తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో, కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు, తన భార్య సరిత(Saritha), తన ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు.

రాత్రి 11 గంటల సమయంలో బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక తల్లి(Mother), నాయనమ్మలు (Grandmother) అడ్డుపడినప్పటికీ, వారిని తోసేసి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపై గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాలికను కారులో బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాలికను హతమార్చిన అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ మళ్లీ వెనక్కి వచ్చాడు. తనను అడ్డుకున్నారనే కక్షతో బాలిక అమ్మ, నాయనమ్మలను అక్కడికక్కడే అతి కిరాతకంగా నరికి చంపాడు.

కన్న పిల్లలు, భార్యను కూడా వదల్లేదు..
అంతటితో రాజ్‌కుమార్ ఉన్మాదం చల్లారలేదు. అక్కడి నుండి నేరుగా తన ఇంటికి బయలుదేరాడు. దారిలోనే తన భార్యకు ఫోన్ చేసి, “పిల్లలను చూసేందుకు వస్తున్నాను” అని చెప్పాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్యపై కత్తితో విరుచుకుపడ్డాడు. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీసినప్పటికీ, వదలకుండా ఇంట్లోకి లాక్కెళ్లి మరీ హతమార్చాడు. ఆ తర్వాత కన్నప్రేమను కూడా మరిచి, తన ఇద్దరు సొంత పిల్లల గొంతు కోసి ప్రాణాలు తీశాడు.

తండ్రికి ఫోన్ చేసి పరారీ..
రాత్రి 11 గంటలకు మొదలైన ఈ నరమేధం అర్ధరాత్రి 1 గంటల వరకు సాగింది. కేవలం రెండు గంటల్లోనే ఆరుగురిని పొట్టనబెట్టుకున్న రాజ్‌కుమార్, ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి తాను చేసిన హత్యల గురించి చెప్పాడు. అనంతరం తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, అదే కారులో అక్కడి నుండి పరారయ్యాడు. ఈ హత్యల ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలను తీవ్రం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment