---Advertisement---

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..
---Advertisement---

యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమెను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని, ప్రియ ఫ్యామిలీ కూడా మ‌ర‌ణ‌శిక్ష నుంచి త‌ప్పించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోందని ఈ మేర‌కు విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైశ్వాల్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ విష‌యంలో ప్రియ కుటుంబానికి కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ప్రియ త‌ల్లి ప్రేమ కుమారి, ఆమెను విడిపించడానికి యెమెన్‌ వెళ్లి, మరణశిక్షను తగ్గించేందుకు హత్యకు గురైన కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు.

కేరళ రాష్ట్రం పాలక్కడ్‎కు చెందిన నిమిషా ప్రియా 2008లో యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా విధుల్లో చేరింది. 2015లో సొంతంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకొని త‌న కాళ్ల తాను నిల‌బ‌డాల‌ని ఆలోచించింది. కాగా, యెమన్ నిబంధ‌న ప్రకారం అక్కడ సొంతగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యెమన్ జాతీయుడిని పెళ్లి చేసుకోవాలి. ఇందుకోసం యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీని ప్రియా 2015లో పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2017లో మహదీని మత్తు మందు ఇచ్చి హ‌త్య చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో ప్రియా దోషిగా తెలడంతో యెమన్ న్యాయస్థానం ఆమెకు మరణ శిక్ష విధించింది. ప్రియా మరణశిక్షను ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి నిన్న‌ ఆమోదించారు. మహదీ ఫ్యామిలీ ప్రియాకు క్షమాబిక్ష ప్రసాదించకపోతే వచ్చే నెల రోజుల్లో ప్రియాకు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ప్రియ‌ను మ‌ర‌ణ‌శిక్ష నుంచి త‌ప్పించేందుకు భార‌త ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment