పూజల పేరిట లక్షల దోపిడీ.. ఎన్నారై పూజారి అరెస్ట్

పూజల పేరిట లక్షల దోపిడీ.. ఎన్నారై పూజారి అరెస్ట్

పూజల పేరిట అమాయకులను నమ్మించి(Convincing), లక్షల్లో డబ్బులు (Money) గుంజేసి, చివరకు ఎదురు తిరిగితే చేతబడి (Black Magic) చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడైన ఎన్నారై పూజారి (NRI Priest) చామర్తి రామ లచ్చారావును (Chamarthi Rama Lacharao) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు (Immigration Officials) అదుపులోకి తీసుకోగా, బాచుపల్లి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు చామర్తి రామ లచ్చారావు పూజారి అవతారమెత్తి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (Software Employee) టార్గెట్ చేశాడు. పూజల పేరుతో నమ్మించి సదరు బాధితుడి నుండి ఏకంగా రూ. 20 లక్షల వరకు కాజేశాడు. ఆ తర్వాత బాధితుడు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అసలు స్వరూపం బయటపెట్టాడు. డబ్బులు అడిగితే ‘చేతబడి’ చేసి సర్వనాశనం చేస్తానంటూ బాధితుడిని (Victim) తీవ్రంగా బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అప్పటికే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు అమెరికాకు పరారయ్యాడు. ఈ కేటుగాడు అక్కడ కూడా తన పాత బుద్ధిని మార్చుకోలేదు. యూఎస్‌లో(US) సైతం పలువురిని నమ్మించి చీటింగ్‌కు పాల్పడ్డాడు. చివరకు అక్కడి ఒక స్థానిక గుడి యజమాని ఇతని మోసాలను గ్రహించి అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయంతో, రామ లచ్చారావు ఇండియాకు(India) తిరుగుపయనమయ్యాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.

“పూజల పేరిట, దోషాల నివారణల పేరిట వలపన్నే ఇలాంటి నకిలీ పూజారుల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి నమ్మకాలతోనూ గుర్తు తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు” అని పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment