17 ఏళ్లకే స్టార్ స్టేటస్.. అందం, ఆటతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇరా ఏరీ

17 ఏళ్లకే స్టార్ స్టేటస్.. అందం, ఆటతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇరా ఏరీ

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికిందా? భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ ఇరా ఏరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విక్టోరియాలో జన్మించిన ఈ అందాల క్రికెటర్ తన ఆటతోనే కాదు, ఆకట్టుకునే వ్యక్తిత్వంతోనూ అభిమానులను ఫిదా చేస్తోంది. చిన్న వయసులోనే ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగిన ఇరా.. భవిష్యత్తులో మహిళల క్రికెట్‌ను శాసించే స్టార్‌గా గుర్తింపు పొందుతోంది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఆమెను కొత్త క్రష్‌గా అభివర్ణిస్తున్నారు.

ఇటీవల ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్-శ్రీలంక అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఇరా ఏరీ అసాధారణ ప్రదర్శన చేసింది. మొత్తం 13 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఒత్తిడి సమయంలోనూ వికెట్లు తీయగల సామర్థ్యం, ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడే నైపుణ్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇప్పటికే కొందరు అభిమానులు ఆమెను ఆస్ట్రేలియా స్టార్ ఎల్లీస్ పెర్రీతో పోలుస్తుండగా, ఇరా మాత్రం తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఆస్ట్రేలియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని ప్రపంచ క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment