డైరెక్ట‌ర్ కామెంట్స్‌కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్!

దర్శకుడి ఆరోపణలకు వరలక్ష్మీ ఘాటు కౌంటర్!

వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారారు. జూన్ 12న విడుదల కానున్న ‘పోలీస్ కంప్లైంట్’ ‘(Police Complaint)సినిమా ప్రమోషన్ల వేళ దర్శకుడు సంజీవ్ మేగోటి (Sanjeev Megoti) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. భారీ పారితోషికం (Remuneration) తీసుకున్నప్పటికీ ప్రమోషన్స్‌కు (Promotions) హాజరు కావడం లేదని, డబ్బింగ్ (Dubbing) సమయంలో కూడా సహకరించలేదని దర్శకుడు ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా విడుదలకు ముందే చిత్రబృందం, హీరోయిన్ మధ్య విభేదాలు బయటపడ్డాయనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ఆరోపణలకు వరలక్ష్మీ (Varalaxmi) కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యానని, తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేశారు.

అంతేకాకుండా “కొన్ని కుక్కలు (Dogs) అరుస్తాయి కానీ కరవవు… నేను అరవను కానీ కరుస్తా” అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలు దర్శకుడికి పరోక్ష హెచ్చరికేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజం ఏదైనా కావొచ్చు కానీ ఈ వివాదం మాత్రం ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాకు ఊహించని స్థాయిలో ప్రచారం తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment