ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో (Batting) క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు మైదానం బయట కూడా సూపర్‌స్టార్‌గా మారుతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్(RR) తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
237.30 స్ట్రైక్‌రేట్‌తో (Strike Rate) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును (Most Valuable Player Award) కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగడమే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ (Brand Endorsement) ప్రపంచంలోనూ అతడిని అత్యంత డిమాండ్ ఉన్న యువ క్రికెటర్‌గా మార్చింది.
ఐపీఎల్‌కు ముందు ఒక్కో ప్రకటన ఒప్పందానికి సుమారు రూ.1 కోటి తీసుకున్న వైభవ్, ఇప్పుడు అదే డీల్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంప్లాన్(Complan), రెడ్ బుల్ (Red Bull) వంటి ప్రముఖ బ్రాండ్లతో అనుబంధం కలిగిన అతడిని మరిన్ని కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.
మరోవైపు అతని ప్రతిభను చూసి పలువురు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి దిగ్గజాలతో పోలుస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా తనను తాను నిరూపించుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో అత్యంత విలువైన యువ బ్రాండ్‌గా అవతరిస్తున్నాడు.








