జర్మనీ రాజకీయాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్, పార్లమెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుననారు. దీంతో జర్మనీ 7 నెలల ముందు సాధారణ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది.
ఫిబ్రవరి 23న జరగనున్న ఈ ఎన్నికలు దేశానికి స్థిరమైన ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయని, ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణం కూడా అదేనని అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ తెలిపారు.
పార్లమెంట్ విశ్వాస తీర్మానంలో ఓడిన ఛాన్సలర్
డిసెంబర్ 16న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, పార్లమెంట్లో విశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. 733 మంది సభ్యులతో కూడిన సభలో, ఆయనకు కేవలం 207 ఓట్లు మాత్రమే లభించాయి, అయితే 394 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ పరిస్థితిలో, ఫిబ్రవరి నెలలో ముందు నుంచీ ఎన్నికలకు వెళ్ళాలని ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. ఈ పరిణామాలతో జర్మనీ రాజకీయాల్లో కొత్త అంచనాలు ఏర్పడుతున్నాయి.