ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం (Liquor Scam) వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా విజయవాడ తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Sivanath – Chinni) భార్య కేశినేని జానకి లక్ష్మికి(Kesineni Janaki Lakshmi) ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 27న (ఎల్లుండి) ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈడీ దర్యాప్తునకు కారణం ఏంటి?
మనీ లాండరింగ్ (Money Laundering) కోణంలో ఆరా తీస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. ప్రధానంగా కొన్ని కంపెనీల పెట్టుబడులు, లాభాల వాటాలపై దృష్టి సారించింది. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి(Raj Kasireddy), ‘ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పి’ (Pride Infracon LLP) కంపెనీకి ఉన్న లింకులపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అక్రమ లాభాల్లో కేశినేని జానకి లక్ష్మికి కూడా షేర్ (వాటా) ఉందనే అనుమానంతో గతంలోనూ ఆమెకు సమన్లు జారీ చేసిన అధికారులు, తాజాగా మరోసారి నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది.
స్పందించిన ఎంపీ కేశినేని చిన్ని
తన భార్యకు ఈడీ(ED) నోటీసులు (Notices) అందాయంటూ వస్తున్న వార్తలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెంటనే స్పందించారు. “నోటీసులు మా కంపెనీకి ఇచ్చారు కానీ, నా భార్య పేరు మీద వ్యక్తిగతంగా ఇవ్వలేదు. ఈ వ్యవహారానికి, లిక్కర్ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ దాటవేశారు. రాజ్ కసిరెడ్డితో భాగస్వామ్యం (Partnership) ఉన్న కంపెనీకి మాత్రమే ఈడీ నోటీసులు ఇచ్చిందని, తన భార్య జానకి లక్ష్మికి వ్యక్తిగతంగా ఇవ్వలేదని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉండగానే 2021లో రాజ్ కసిరెడ్డితో కలిసి SPV కంపెనీని ఏర్పాటు చేశామని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. అందులో ‘ఈశాన్వి'(Eeshanvi), ‘కేశినేని డెవలపర్స్'(Kesineni Developers) అనే రెండు సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అడిగిన వివరాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. ఎల్లుండి (మే 27న) తమ ప్రతినిధులు ఈడీ ముందుకు వెళ్లి పూర్తి వివరాలను, ఆధారాలను సమర్పిస్తారని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.








