డీప్‌ఫేక్ బారినపడ్డ కన్నడ బ్యూటీ ‘రుక్మిణీ వసంత్’

డీప్‌ఫేక్ బారినపడ్డ కన్నడ బ్యూటీ 'రుక్మిణీ వసంత్'

Summarize with AI

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఏఐ (AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ వేధిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు దీని బారిన పడగా.. తాజాగా ‘కాంతారా-2′(Kantara-2) చిత్రంతో తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటి రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ఈ డీప్‌ఫేక్(Deepfake) మాయాజాలానికి బలయ్యారు. ఆమెకు సంబంధించిన ఒక నకిలీ బికినీ (Fake Bikini) వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ తీవ్రంగా స్పందించారు.

అసలేం జరిగిందంటే..?
రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లోకి(Swimming Pool) దిగుతున్నట్లు ఉన్న ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే అది నిజమైన వీడియో కాదు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ, వేరే మహిళ శరీరానికి రుక్మిణీ వసంత్ ముఖాన్ని జోడించి ఈ డీప్‌ఫేక్ (Deepfake) వీడియోను సృష్టించారు. ఈ నకిలీ వీడియో తన దృష్టికి రావడంతో నటి రుక్మిణీ వసంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా ద్వారా ఈ వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

“ఇలాంటి నకిలీ కంటెంట్‌ను సృష్టించడం, దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఇది ఒక వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రైవసీని (Privacy) తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఇలాంటి ఫేక్ కంటెంట్‌లను ఎవరూ పోస్టు చేయొద్దు, షేర్ చేయొద్దు అని కోరుతున్నాను. ఈ ఘాతుకానికి పాల్పడిన సదరు వ్యక్తులపై నేను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాను” అని పోస్టు చేశారు.

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లో చాన్స్!
2019లో ‘బీర్బల్’(Birbal) అనే చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేసిన రుక్మిణి.. 2023లో వచ్చిన ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaradaache Ello) సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో తన సహజమైన నటన, హోమ్లీ లుక్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment