“ప్రభుత్వంలో ఖర్చులు తగ్గించుకోవాలి.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఇచ్చిన ఉచిత సలహాలను ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అస్సలు ఖాతరు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం పొదుపు (Public Money Saving) చేయాలంటూ సీఎం చెబుతున్న మాటలను ‘పుత్రుడు, దత్తపుత్రుడు’ ఇద్దరూ లెక్కచేయడం లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన విమర్శలను, లోకేష్ రుజువు చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇంధన పొదుపును దృష్టిలో ఉంచుకుని, మంత్రులెవరూ కొన్నాళ్లపాటు విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఇటీవల కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న కొద్దిరోజులకే మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనకు (Foreign Tour) సిద్ధమవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే జూన్ 3 నుండి 6 వరకు రష్యాలో జరగనున్నSPIEF 2026 సదస్సులో పాల్గొనేందుకు లోకేష్ రష్యా(Russia) వెళ్లనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం గమనార్హం. ఇదే నెల (మే) 10 నుండి 12 వరకు సింగపూర్ (Singapore) పర్యటించిన ఆయన, ఇప్పుడు మళ్లీ రష్యా ప్రయాణానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.
ప్రత్యేక విమానాలు.. భారీ కాన్వాయ్‌లు!
కేబినెట్ పొదుపు నిర్ణయాల తర్వాత కూడా మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక విమానాల్లో (Special Flights) ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్ననే మంత్రి లోకేష్ ప్రత్యేక విమానంలో కడప పర్యటనకు వెళ్లారు. అంతకుముందు కేబినెట్ ముగిసిన కొద్ది గంటల్లోనే శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకుని, అక్కడి నుంచి ధర్మవరానికి భారీ కాన్వాయ్‌తో వెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

కేవలం పబ్లిసిటీ స్టంట్‌లేనా?
ఒకపక్క రాష్ట్రంలో నిధుల కొరత ఉందని చెబుతూనే, మరోపక్క మంత్రుల విలాసవంతమైన పర్యటనలకు రూ. కోట్లు ఖర్చు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న పొదుపు చర్యలు కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా మారాయని, సొంత మంత్రులే సీఎం మాటలను బేఖాతరు చేస్తుంటే ఇక ఈ కేబినెట్ నిర్ణయాలకు విలువేముందని సామాన్య ప్రజల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు పొదుపు మాటలపై ప్రెస్‌మీట్‌లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నిన్న వైఎస్ జగన్ చెప్పిన సమాధానాలను లోకేష్ నిజం చేస్తున్నాడనే మాటలు ఆసక్తికరంగా మారాయి.
కొన్నాళ్ల పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
— Telugu Feed (@Telugufeedsite) May 22, 2026
కేబినెట్ నిర్ణయాలను పట్టించుకోని మంత్రి లోకేష్
జూన్‌లో రష్యా పర్యటనకు వెళ్లనున్న నారా లోకేష్
జూన్ 3 నుండి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్న లోకేష్
SPIEF 2026లో పాల్గొనేందుకు లోకేష్ వెళ్తున్నట్టు జీవో… https://t.co/H2aR6MTkiR pic.twitter.com/guc976OmLG







