యువతి కోసం విజయవాడలో ఇద్దరు యువకుల బీభత్సం (Video)

vijayawada-thar-jeep-fight-patamata-road-rage-incident

యువ‌తి (Young Woman) కోసం ఇద్ద‌రు యువ‌కులు రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తించారు. విజ‌య‌వాడ (Vijayawada) నగర నడిబొడ్డున పటమట హైటెన్షన్ 100 అడుగుల రోడ్డులో గురువారం రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా ఇద్దరు యువకులు (Two Youths) సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక యువతి విషయంలో తలెత్తిన మనస్పర్థలే ఈ గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది.

చిన్ననాటి స్నేహితులైన బొల్లా ఓం (Bolla Om) (భారతీనగర్), లింగమనేని రోహిత్ (Lingamaneni Rohit) మధ్య కొంతకాలంగా ఒక యువతి విషయంలో వివాదం నడుస్తోంది. గురువారం రాత్రి జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో, ఇద్దరూ తమ థార్ (Thar) జీపులతో పటమట హైటెన్షన్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకుంటూ బీభ‌త్సం సృష్టించారు.

జీపులను ఢీకొట్టుకోవడమే కాకుండా, వాహనాల నుంచి దిగిన ఇద్దరు యువకులు ఇనుప రాడ్లతో (Iron Rods) ఒకరి వాహనం అద్దాలను మరొకరు పగలగొట్టుకుంటూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఒక వాహనంలో వివాదానికి కారణమైన యువతి కూడా ఉన్నట్లు సమాచారం. నడిరోడ్డుపై జరిగిన ఈ గ్యాంగ్ వార్ స్టంట్లు చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన లింగమనేని రోహిత్ తన జీపును అక్కడే వదిలేసి పరారయ్యాడు. మరో యువకుడు బొల్లా ఓంను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని విచారిస్తున్నారు.

ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రోహిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో ఇలాంటి రౌడీయిజంపై (Rowdyism) స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అర్ధ‌రాత్రి బీభ‌త్సం సృష్టిస్తుంటే పోలీసుల ప‌హారా ఎక్క‌డ అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment