వీడిన సందిగ్ధత.. APFDC చైర్మన్‌గా భరత్

వీడిన సందిగ్ధత.. APFDC చైర్మన్‌గా భరత్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) బోర్డు నియామకంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

టాలీవుడ్‌లో సీనియర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు పి. భరత్ భూషణ్(P. Bharat Bhushan) వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఆయన్ను AP FDC చైర్మన్‌గా నియమించింది. ఇక వైస్ చైర్మన్‌గా ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్ (Meher Ramesh Kumar) ఎంపికయ్యారు.

బోర్డులోకి 14 మంది డైరెక్టర్లు
సినిమా, నాటక, టీవీ రంగాలకు చెందిన 14 మంది ప్రముఖులను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం బోర్డును నియ‌మించింది. ఈ కమిటీలో సినీ రచయిత, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు బుర్రా సాయిమాధవ్ తో పాటు, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, ప్రముఖ రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావులకు చోటు దక్కింది. అలాగే హీరోలు సుమన్ తల్వార్, శివాజీ, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద, నటి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమా మహేశ్వరరావు, దర్శకుడు వి. సముద్ర, మీర్ ఎస్, ఎ.సత్యనారాయణ, ఎస్.వెంకట కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలను డైరెక్టర్లుగా నియమించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment