బాబు తాత్కాలిక మిత్రుడు.. పవన్‌కు అమిత్ షా క్లాస్

బాబు తాత్కాలిక మిత్రుడు.. పవన్‌కు అమిత్ షా క్లాస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంతర్గత వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) అరెస్ట్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాలను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు (Professor Nageswara Rao) బ‌య‌ట‌పెట్టారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్(Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సహా కొందరు జనసేన ముఖ్య నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం, పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమై, ఆ తర్వాత కోర్ టీమ్‌తో (Core Team) అమిత్ షాతో జరిగిన సంభాషణను పంచుకున్నారు. పవన్ సూచన మేరకు నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను కోర్ కమిటీకి వివరించినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.

‘జగన్ లాంగ్‌టర్మ్ ఫ్రెండ్’..
అమిత్ షాతో జరిగిన భేటీలో పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. “మా వాళ్ల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది.. జగన్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి” అని కోరినట్లు సమాచారం. అయితే, పవన్ అభ్యర్థనపై అమిత్ షా స్పందించిన తీరు సంచ‌ల‌నంగా మారింది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే సూత్రాన్ని గుర్తు చేస్తూ అమిత్ షా పవన్‌కు క్లాస్ పీకారని ప్రొఫెసర్ వెల్లడించారు. “రాజకీయాల్లో ఇన్‌స్టంట్ ఫ్రెండ్స్, లాంగ్‌టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. ప్రస్తుతానికి తెలుగుదేశం (చంద్రబాబు) (Chandrababu) మనకు ఇన్‌స్టంట్ ఫ్రెండ్ కావచ్చు.. కానీ వైఎస్ జగన్ (YS Jagan) మనకు లాంగ్‌టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడికి జగన్‌పై వ్యక్తిగత లేదా రాజకీయ శత్రుత్వం ఉండొచ్చు. కానీ ఆ శత్రుత్వం మనకెందుకు ఉండాలి?”

“మీకు కూడా ఒక మంచి మాట చెబుతున్నాను.. జగన్ భవిష్యత్తులో లాంగ్‌టర్మ్ ఉపయోగపడతాడు. పార్లమెంట్‌లో మనకు (బీజేపీకి)(BJP) వారి 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా? కాబట్టి మీరు కూడా జగన్ విషయంలో మీ వైఖరి మార్చుకోవాలి” అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అమిత్ షా సూచించార‌ని నాగేశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు.

చంద్రబాబు కోసమే పవన్ ఒత్తిడి తెచ్చారా?
అమిత్ షా ఇచ్చిన ఈ షాకింగ్ ఆన్స‌ర్‌తో పవన్ కల్యాణ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేచింది.

నిజానికి గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ వైపు నుంచే జగన్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్, ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ, జనసేన వైపు నుంచి జగన్‌ను అరెస్ట్ చేయించాల్సిన అవసరం గానీ, అంతటి శత్రుత్వం గానీ ఉండాల్సిన పనిలేదు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఢిల్లీ స్థాయికి వెళ్లి మరీ జగన్ అరెస్ట్ కోసం ఒత్తిడి తెచ్చారంటే.. ఆయన ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రయత్నం చేశారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు, రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

ఈ వైరల్ వీడియో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ, అటు జనసేన అంతర్గత వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment