రక్షణ (Protection) కల్పించాల్సిన పోలీసులే సామాన్యులపై దాష్టీకానికి దిగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలో ఖాకీల దాష్టీకం పరాకాష్టకు చేరింది. మద్యం సేవించావన్న సాకుతో పెదవేగి ఎస్ఐ హరి గోపాల్ (SI Hari Gopal) ఒక యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి, ఒళ్లంతా వాతలు తేలేలా కొట్టిన ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి రాజా (Devarapalli Raja) అనే యువకుడిని అడ్డుకున్న ఎస్ఐ హరి గోపాల్, అతను మద్యం (Alcohol) సేవించాడని ఆరోపిస్తూ దాడికి దిగారు. ఎటువంటి విచారణ లేకుండానే, అత్యంత కక్షపూరితంగా రాజాను లాఠీలతో చితకబాదారు. శరీరమంతా వాతలు తేలేలా దారుణంగా కొట్టడంతో ఆ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల దాడిలో ఆ యువకుడి చెయ్యి విరిగింది.
పోలీసుల తీరును అడ్డుకుంటూ బాధితుడి కుటుంబ సభ్యులు వీడియో తీసేందుకు ప్రయత్నించగా, ఎస్ఐ, కానిస్టేబుళ్లు వారిపై కూడా గొడవకు దిగారు. సాక్ష్యాలు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బరితెగించి ప్రవర్తించారని బాధితుడి తరపు వారు ఆరోపిస్తున్నారు.
తల్లి ఆవేదన.. ఉన్నతాధికారులకు విన్నపం
తన కొడుకును పోలీసులు కావాలనే టార్గెట్ చేశారని బాధితుడి తల్లి కుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పోలీసులు తమ చుట్టంగా చట్టాన్ని వాడుకుంటూ సామాన్యులను హింసిస్తున్నారు. నా కొడుకును అకారణంగా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు. కక్షపూరితంగా ప్రవర్తించిన ఎస్ఐ హరి గోపాల్‌పై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బాధితుడి బంధువులు హెచ్చరిస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ఎస్ఐ దాష్టీకం
— Telugu Feed (@Telugufeedsite) May 14, 2026
ఓ యువకుడిని చితకబాదిన పెదవేగి ఎస్ఐ హరి గోపాల్
మందు తాగావంటూ కారణం లేకుండా దేవరపల్లి రాజా అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి
వాతలు తేలేలా దారుణంగా కొట్టిన ఎస్ఐ
పోలీసులు కావాలనే తన కొడుకుపై కక్షపూరితంగా ప్రవర్తించారని బాధుతుడి తల్లి (కుమారి)… pic.twitter.com/aC7ateq3oa








పొదుపు సూక్తులు పరులకేనా మంత్రి గారూ? – నెటిజన్ల ప్రశ్న