డూప్ లేకుండా యాక్షన్ సీన్.. రష్మిక డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

డూప్ లేకుండా యాక్షన్ సీన్.. రష్మిక డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) మరోసారి తన డెడికేషన్‌తో (Dedication) అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ‘మైసా’(Mysa) చిత్రంలో నటిస్తున్న రష్మిక.. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఉన్న ఎత్తుల భయాన్ని పూర్తిగా జయించానని వెల్లడించింది. కొచ్చిలోని (Kochi) దట్టమైన అడవుల్లో జరిగిన షూటింగ్ అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “అడవులు, వర్షాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు.. ప్రతి రోజు ఒక కొత్త అనుభవంలా అనిపించింది. ఎత్తులంటే నాకు చాలా భయం. కానీ ఈ సినిమా వల్ల ఆ భయాన్ని జయించగలిగాను” అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. షూటింగ్ సమయంలో మోకాళ్లకు గాయాలైనా వెనక్కి తగ్గకుండా పనిచేయడం తనకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్(Action Sequence) కోసం రష్మిక ఎలాంటి డూప్ (Dupe) లేకుండా ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. ఈ సాహసోపేతమైన సీన్ చిత్రీకరణలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలైనా షూటింగ్ ఆపకుండా కొనసాగించిందని దర్శకుడు రవీంద్ర పుల్లె (Ravindra Pulle) వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ తన సత్తా చాటుతున్న రష్మికపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మైసా’ సినిమాలో రష్మికను పూర్తిగా కొత్త అవతారంలో చూడబోతున్నామని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment