ఆంధ్రప్రదేశ్Andhra Pradesh) రాష్ట్రం అప్పుల ఊబిలో(Debts Crisis) కూరుకుపోతోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India – RBI) వద్ద అప్పు చేయనిదే గడవని పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర అప్పులు రూ. 3.71 లక్షల కోట్లు దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు సామాన్యుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మాత్రం తన నివాసాల హంగుల కోసం ప్రజా ధనాన్ని (Public Money) కోట్లలో ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దుబారా ఖర్చు తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనతో సీఎం నివాస ఖర్చుల అంశం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనల సమయంలో బస చేసే నివాసం కోసం ప్రభుత్వం గతంలో రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మీటింగ్ హాల్ నిర్మాణం, మైనర్ రిపేర్ల పేరుతో రూ.67 లక్షల నిధులు కేటాయించారు. గతంలోనే ఇదే నివాసానికి సౌకర్యాల కల్పన (Facilities Arrangement) కోసం రూ. 95 లక్షలు ఖర్చు చేశారు. అంటే కేవలం ఢిల్లీలోని ఒక్క ఇంటి కోసమే ఇప్పటివరకు రూ. 1.62 కోట్లు వెచ్చించడం గమనార్హం.

కరకట్ట ‘ప్యాలెస్’కు కోట్ల నిధులు
అమరావతిలోని (Amaravati) ముఖ్యమంత్రి నివాసం (కరకట్ట) వద్ద రోడ్డు మరమ్మతులు(Road Repairs), ఇతర హంగుల కోసం రూ. 5.32 కోట్లు ఖర్చు చేశారు. కరకట్టలోని సీఎం నివాస మరమ్మతుల కోసం గతేడాది అక్టోబర్‌లో (13-10-2025) రూ. 95 లక్షలు, మళ్ళీ వారం రోజుల వ్యవధిలోనే (21-10-2025) మరో రూ. 1.07 కోట్లు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో ఈ తరహా “దుబారా” ఖర్చులపై ప్రజలు మండిపడుతున్నారు.

హెలికాప్టర్లు, విమానాలు.. అంతా ఖజానా పైనే!
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్(Nara Lokesh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రయాణాలు కూడా రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారాయి. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్‌లు (Cricket Matches) వీక్షించేందుకు స్పెషల్ ఫ్లైట్లు (Special Flights) వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ ముగ్గురు నేతలూ నిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారని, వీరి ప్రయాణ ఖర్చులకు అయ్యే కోట్లాది రూపాయలు ప్రభుత్వమే వెచ్చిస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రికి దీటుగా పవన్ కళ్యాణ్, లోకేష్‌ల కోసం ప్రత్యేక కాన్వాయ్‌లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఇంధన ఆదా కోసం, ఖర్చులు తగ్గించడం కోసం తన కాన్వాయ్‌ను 50 శాతానికి తగ్గించుకున్నారు. కేంద్రంలో మంత్రులు కూడా పొదుపు మంత్రం పాటిస్తుంటే, ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రజలపై అప్పులభారం పెరిగిపోతున్నా.. కూటమి నేతల విలాసవంతమైన జీవితాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
“దుబారా ఖర్చులతోనే రాష్ట్రాన్ని దివాళా తీయిస్తారా?” అని ప్రజలు, ఆర్థిక నిపుణులు, రాజకీయ పండితులు ముక్తకంఠంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అభివృద్ధి కంటే హంగులకే ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.









