సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. సూర్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్

సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. సూర్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్

Summarize with AI

తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే నటుడు విజయ్(Vijay) సినీ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. చాలా కాలంగా తమిళనాడులో కనిపించకుండా పోయిన ఎర్లీ మార్నింగ్ స్పెషల్ షోల (Early Morning Special Show) కల్చర్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. సూర్య (Suriya) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’కి (Karuppu) ఉదయం 9 గంటల స్పెషల్ షోలకు అధికారిక అనుమతి లభించింది. దీంతో సూర్య ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సంబరాలకు సిద్ధమవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయ్ పాలనలో స్పెషల్ షోలకు అనుమతి రావడం ఇదే మొదటిసారి కావడం ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో(Tamil Film Industry) హాట్ టాపిక్‌గా మారింది. సినిమా రంగం, అభిమానుల ఉత్సాహం, బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రాధాన్యం బాగా తెలిసిన హీరోగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

ఒకప్పుడు తమిళనాడులో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయంటే తెల్లవారుజామునే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మామూలుగా ఉండేది కాదు. పాలాభిషేకాలు, భారీ కటౌట్లు, పూలదండలు, టపాసులతో పండగ వాతావరణం కనిపించేది. అయితే గత ప్రభుత్వాల ఆంక్షలతో ఆ సంస్కృతి పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ‘కరుప్పు’ సినిమాతో మళ్లీ ఆ స్పెషల్ షోస్ కల్చర్ తిరిగి రావడంతో బాక్సాఫీస్ వద్ద పాత జోష్ కనిపించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’(Veerabhadrudu) పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment