ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal), ఉత్తర శ్రీలంక తీరాన్ని (Northern Sri Lanka Coast) ఆనుకుని అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడిందని, ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో రేపు (మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రభావితమయ్యే జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని, పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అల్లూరి జిల్లాలోని జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు.. పోలవరం, మన్య ప్రాంతాల్లో చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా విజయవాడ తూర్పులో 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.








‘సిట్’ వేయడమంటే కేసును నీరుగార్చడమే.. – హరీష్రావు