త్రిష ఆశలకు బ్రేక్ పడిందా?

త్రిష ఆశలకు బ్రేక్ పడిందా?

తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) సంచలనం సృష్టించిన టీవీకే (TVK) అధినేత విజయ్‌(Vijay). ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారింది. పూర్తి మెజారిటీ కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్న విజయ్‌కు ఇప్పుడు రాజకీయాల కంటే వ్యక్తిగత జీవితం, సినీ వర్గాల చర్చలే ఎక్కువ హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా నటి త్రిషతో (Trisha Krishnan) ఆయన సన్నిహిత సంబంధాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త తమిళనాట వైరల్‌గా మారింది. విజయ్‌ ఖాళీ చేయబోయే తిరుచ్చి ఈస్ట్‌ స్థానంలో త్రిషను పోటీ చేయించి, భవిష్యత్తులో కీలక పదవి ఇవ్వొచ్చనే టాక్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇదే సమయంలో త్రిష రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలకు మరింత బలం చేకూరేలా పాత వీడియోలు, ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో “అవకాశం వస్తే సీఎం అవ్వాలని ఉంది” అంటూ త్రిష చెప్పిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అయ్యాయి. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇవ్వడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజునే త్రిష పుట్టినరోజు కావడం, విజయ్‌ను స్వయంగా కలిసి అభినందించడం, ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో కనిపించడం వంటి అంశాలు అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతున్నాయి.

అయితే త్రిష రాజకీయ ఆశలకు ఇప్పుడు వీసీకే పార్టీ బ్రేక్ వేయొచ్చనే చర్చ మొదలైంది. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన వీసీకే పార్టీ(VCK Party) … డిప్యూటీ సీఎం పదవి, మంత్రి పదవి, ప్రత్యేక దళిత చట్టం, తిరుచ్చి ఈస్ట్ సీటు వంటి కీలక డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్‌ ఖాళీ చేసే నియోజకవర్గాన్ని తమకే ఇవ్వాలన్న షరతు.. త్రిష రాజకీయ ఎంట్రీపై అనుమానాలు పెంచుతోంది. ప్రస్తుతం టీవీకేకు వీసీకే మద్దతు అత్యంత కీలకంగా మారడంతో.. విజయ్‌ ఆ డిమాండ్లకు అంగీకరిస్తారా లేదా అన్నదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment