మెట్ గాలాలో మెరిసిన సుధారెడ్డి.. నెక్లెస్ ఖ‌రీదు రూ.142 కోట్లా..?

మెట్ గాలాలో మెరిసిన సుధారెడ్డి.. నెక్లెస్ ఖ‌రీదు రూ.142 కోట్లా..?

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా 2026’లో (Met Gala 2026) హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త భార్య‌ సుధా రెడ్డి (Sudha Reddy) సంచలనం సృష్టించారు. ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ (Fashion Is Art) థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో ఆమె ధరించిన ఆభరణాలు, దుస్తులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. నెట్టింట తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి.

రూ. 142 కోట్ల నెక్లెస్ ప్రత్యేకత
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన‌ మెఘా కంపెనీ (Megha Company) య‌జ‌మాని కృష్ణారెడ్డి (Krishna Reddy) భార్య (wife) సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ విలువ (Necklace Value) ఏకంగా 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 142 కోట్లు) అని సమాచారం. ఈ నెక్లెస్‌లో ప్రధాన ఆకర్షణ ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ (Queen of Merelani) అని పిలిచే అత్యంత అరుదైన 550 క్యారెట్ల వైలెట్-బ్లూ టాంజానియాట్ రాయి. ఇది టాంజానియాలోని మెరెలానీ కొండల నుంచి సేకరించినది.

విక్టోరియన్ శైలిలో రూపొందించిన ఈ నెక్లెస్‌లో త్రిభుజాకారపు, పియర్ ఆకారపు రోజ్-కట్ వజ్రాలను పూల గుత్తుల మాదిరిగా అమర్చారు. ఈ ఖరీదైన ఆభరణం ఆమె సొంత కలెక్షన్ కావడమే కాకుండా, దీనితో పాటు 40 క్యారెట్ల ఎమరాల్డ్ రింగ్, 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్ కూడా ధరించి రాయల్ లుక్‌లో కనిపించారు.

‘ట్రీ ఆఫ్ లైఫ్’ – కలంకారీ కళతో రూపుదిద్దుకున్న గౌన్
ఆమె ధరించిన గౌన్ కూడా ఒక కళాఖండంలా ఉంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం కలంకారీ శైలిలో ‘ట్రీ ఆఫ్ లైఫ్’ (కల్పవృక్షం) థీమ్‌తో ఈ గౌన్ తయారైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట, జమ్మి చెట్టు, తంగేడు పువ్వులు, సూర్య, చంద్రుని చిత్రాలను అద్భుతంగా పొందుపరిచారు.

మూడోసారి మెట్ గాలాలో..
సుధా రెడ్డి మెట్ గాలాలో పాల్గొనడం ఇది మూడోసారి (2021, 2024, 2026). కేవలం ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాకుండా, భారతీయ చేతివృత్తుల గొప్పతనాన్ని, హైదరాబాద్ సంస్కృతిని గ్లోబల్ స్టేజ్ మీద ప్రదర్శించడమే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ధరించిన ఆ నెక్లెస్ విలువ, దాని వెనుక ఉన్న కళా నైపుణ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment