తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో (Tamil Nadu Elections Results) దళపతి విజయ్ (Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సృష్టించిన సునామీ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే, ఎవరితోనూ పొత్తు లేకుండా సింగిల్‌గా బరిలోకి దిగి ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ'(Single Largest Party)గా అవతరించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయ్ మధ్య ఉన్న స్నేహానికి సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Y. S. Jagan Mohan Reddy), దళపతి విజయ్ (Vijay) అభిమానులు చేస్తున్న హంగామా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
వైరల్ అవుతున్న జగన్ – విజయ్
సోషల్ మీడియాలో విజయ్, జగన్ అభిమానులు గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న దృశ్యాలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ సోదరుడి వివాహ వేడుకకు విజయ్ హాజరైన వీడియోలు, ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ తన ప్రసంగాల్లో జగన్ ఫోటోను ప్రదర్శించిన సందర్భాలను గుర్తుచేస్తూ ఆ వీడియోలను టీవీకే, వైసీపీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. “సింగిల్‌గా పోరాడే దమ్మున్న నాయకులు” అంటూ ఇద్దరు నేతల ఫోటోలతో కూడిన స్టేటస్లు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
“పొత్తుల్లేవు.. అన్నీ సింగిలే!”
విజయ్ విజయంపై స్పందిస్తున్న ఫ్యాన్స్, రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ‘పొత్తుల’ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడే వారంతా కేవలం పొలిటీషియన్లేనని, ప్రజల మీద నమ్మకంతో ఒంటరిగా పోరాడేవారే నిజమైన నాయకులని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడులో విజయ్ ఒంటరి పోరాటం, ఇతర పార్టీల పొత్తులపై ఆధారపడే సినీ కం రాజకీయ నేతలకు ఒక ‘చెంపపెట్టు’ లాంటి తీర్పు అని అభిమానులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ.. “మరో పార్టీ జెండా మోయకుండా, కార్యకర్తలను కూలీలుగా మార్చకుండా విజయ్ను చూసి నేర్చుకోండి” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
2029 లక్ష్యంగా ‘ప్రభంజనం’
తమిళనాడులో విజయ్ గాలి వీచినట్లుగానే, 2029 ఏపీ ఎన్నికల్లో జగన్ మళ్ళీ ప్రభంజనం సృష్టిస్తారని టీవీకే, వైసీపీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ తమ సిద్ధాంతాలకు కట్టుబడి, ఎవరితోనూ రాజీ పడకుండా ముందుకు సాగడం తమకు గర్వకారణమని వారు పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి విజయ్ విజయం తమిళనాడుకే పరిమితం కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాలపై, ముఖ్యంగా సోషల్ మీడియా వార్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. విజయ్ సాధించిన విజయానికి వైసీపీ శ్రేణులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
సింగిల్ గా పోటీ చేసిన మగాళ్ళు
— రామ్ (@ysj_45) May 4, 2026
పొత్తుల కోసం ఎవడి కాళ్ళు పట్టుకోలేదు
వాళ్ల బలం ఏంటో వాళ్ళకే తెలుసు #Ysjagan #TVKVijayHQ pic.twitter.com/QSuJ74sHOY
సింగిల్ గా పోటీ చేసి గెలిస్తేనే అసలైన విజయం#YSJagan #TVKVijay #Tamilnadu pic.twitter.com/RbSf8GGoBc
— Jagan anna 2.0 (@Jagananna2Po) May 4, 2026








