మలయాళ బ్లాక్‌బస్టర్ ‘వాలా 2’ తెలుగు రిలీజ్‌తో.. యూత్ కు ఫుల్ కనెక్ట్

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘వాలా 2’ తెలుగు రిలీజ్‌తో.. యూత్ కు ఫుల్ కనెక్ట్

మలయాళంలో సంచలనం సృష్టించి రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన యూత్‌ఫుల్ డ్రామా వాలా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ తెలుగులో ఏప్రిల్ 24న విడుదలై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నాలుగు బెస్ట్ ఫ్రెండ్స్ జీవితాల చుట్టూ తిరుగుతుంది. స్కూల్, కాలేజీ రోజుల్లో అల్లరి, ప్రేమలు, తప్పులు చేస్తూ “లూజర్స్”గా ముద్రపడిన ఈ కుర్రాళ్లు, ఆ ముద్రను చెరిపేసుకోవడానికి విదేశాలకు వెళ్లి ఎదుర్కొన్న సవాళ్లే కథకు ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్‌ఫుల్ కామెడీతో, కాలేజీ రోజులను గుర్తు చేసే నేచురల్ హ్యూమర్‌తో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది.

డబ్బింగ్ సినిమా అనే ఫీల్ రాకుండా తెలుగు మీమ్స్, రిఫరెన్సులు చక్కగా కలిపి వినోదాన్ని పెంచారు.
సెకండ్ హాఫ్‌లో మాత్రం టోన్ పూర్తిగా మారి ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. మిడిల్ క్లాస్ యువత ఎదుర్కొనే కెరీర్ టెన్షన్స్, కుటుంబ ఒత్తిడులు, విదేశాల్లో స్నేహితుల స్ట్రగుల్స్‌ను నిజాయితీగా చూపించడం సినిమాకు బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఇస్తుంది. అయితే కొన్ని చోట్ల నెరేషన్ స్లోగా అనిపించినా, క్లైమాక్స్‌లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయి. నటీనటులందరూ సహజంగా నటించి, ముఖ్యంగా నాలుగు ప్రధాన పాత్రలు స్క్రీన్‌పై నిజ జీవిత స్నేహితుల్లా అనిపిస్తారు. మొత్తంగా వాలా 2 ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమై, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ముగిసే సినిమాగా మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment