వైసీపీ నేత పూడి శ్రీహరి అక్రమ నిర్బంధం.. తాడేపల్లిలో హైడ్రామా!

వైసీపీ నేత పూడి శ్రీహరి అక్రమ నిర్బంధం.. తాడేపల్లిలో హైడ్రామా!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్ర‌తిప‌క్ష వైసీపీ(YSRCP) నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వ అరెస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం)(State General Secretary – Media Wing) పూడి శ్రీహరిని (Pudi Srihari) పోలీసులు అక్రమంగా నిర్బంధించిన తీరు సంచలనం సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సంఘటన వివరాలు
బుధవారం ఉదయం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (Y. S. Jagan Mohan Reddy) కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులు శ్రీహరిని అడ్డుకున్నారు. ఉదయం 8:05 గంటల సమయంలో మార్గమధ్యలో శ్రీహరి కారును అడ్డుకున్న పోలీసులు, ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఆ సమయంలో శ్రీహరితో ఉన్న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిని కూడా పోలీసులు హెచ్చరించారు. “వాహనాన్ని ఫాలో అయితే అరెస్ట్ చేస్తాం” అంటూ భయపెట్టినట్లు సమాచారం. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే శ్రీహరి వ్యక్తిగత మొబైల్ ఫోన్(Mobile Phone), ల్యాప్‌టాప్‌లను (Laptop) పోలీసులు లాక్కున్నారు.

ముందస్తు వ్యూహం..
శ్రీహరి అరెస్ట్ అప్పటికప్పుడు జరిగింది కాదని, దీని వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని వైసీపీ లీగల్ టీమ్ (YSRCP Legal Cell) ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా వారు విడుదల చేశారు. ఉదయం 3 గంటల సమయం నుంచే ఆరుగురు పోలీసులు మఫ్టీలో శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ తెలిపారు. మఫ్టీలో ఉన్న పోలీసులు వాచ్‌మెన్‌కు ఐడీ కార్డులు చూపించి, శ్రీహరి కారు నంబర్ ఆధారంగా ఆయన కోసం గాలిస్తున్నట్లు విచారించారు. పోలీసులు శ్రీహరిని బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

వైసీపీ ఆగ్రహం – హెబియస్ కార్పస్ పిటిషన్
శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఏ కేసులో అరెస్ట్ చేశారు? అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ లీగల్ సెల్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. చట్ట వ్యతిరేకంగా వ్యక్తిని నిర్బంధించినప్పుడు కోర్టులో దాఖలు చేసే ఈ పిటిషన్ ద్వారా శ్రీహరి ఆచూకీని బయటపెట్టాలని వారు కోరనున్నారు. అరెస్ట్ జరిగిన కొద్దిసేపటికే పోలీసులు మళ్లీ పూడి శ్రీహరి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు (Searches) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీహరి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment