ఘోర విమాన ప్రమాదం.. 72 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 72 మంది మృతి

Summarize with AI

కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నించింది. అయితే, పొగ మంచు కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి దారితీసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 72 మంది మృతి చెందినట్లు సమాచారం అందింది. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంతో స్థానికులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

ప్రజల ఆవేదన
ఈ ఘోర ప్రమాదం అనంతరం స్థానిక ప్రజలు క్ష‌త‌గాత్రుల‌ను ర‌క్షించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. విమాన ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం అత్యవసరం అని నిపుణులు అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment