ప్రకాష్ రాజ్ ఇంట్లో విషాదం

ప్రకాష్ రాజ్ ఇంట్లో విషాదం

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి(Mother) సువర్ణలత (Suvarnalatha) 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు(సోమవారం) సాయంత్రం బెంగళూరులో (Bengaluru) సువర్ణలత అంత్యక్రియలు (Funeral Rites) నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత నేపథ్యాన్ని పరిశీలిస్తే… ఆమె హుబ్లీలోని (Hubli) ఒక అనాథ శరణాలయంలో పెరిగారు. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చారు. సువర్ణలత క్రైస్తవ మతానికి చెందినవారు కాగా, ప్రకాశ్ రాజ్ తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. భిన్నమైన సంస్కృతులు, మతాల నేపథ్యం ఉన్న కుటుంబంలో ప్రకాష్ రాజ్ పెరిగారు. ఇది ప్రకాష్ వ్యక్తిత్వంలో వైవిధ్యానికి కారణమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment