అమ్మో ఏంటా బొమ్మ‌.. లోకేష్ పూజ‌గ‌ది ఫొటోపై నెట్టింట చ‌ర్చ‌

అమ్మో ఏంటా బొమ్మ‌.. లోకేష్ పూజ‌గ‌ది ఫొటోపై నెట్టింట చ‌ర్చ‌

నారా లోకేష్ (Nara Lokesh) ఉగాది పూజకు (Ugadi Festival Rituals) సంబంధించిన ఫోటోలు(Photos) ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఆయన పూజగదిలో (Pooja Room) కనిపించిన ఒక వింత బొమ్మ క్షుద్రపూజల అనుమానాలకు దారితీయడం, దానికి లోకేష్ ఇచ్చిన వివరణ మరిన్ని విమర్శలకు తావివ్వడంతో నెట్టింట చర్చ ముదిరింది.

పూజగదిలో ఆ వింత బొమ్మ ఏంటి?
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లోకేష్ తన ఇంట్లో పూజ చేస్తున్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే, ఆ ఫోటోల్లో దేవుడి పటాల (God Images) వెనుక క్షుద్రపూజల్లో (Black Magic Practices) వాడే బొమ్మను పోలిన ఒక వింత ఆకారం కనిపించడంతో నెటిజన్లు కంగుతిన్నారు. “సాధారణంగా దేవుడి గదిలో ఇలాంటి బొమ్మలు ఎందుకు ఉంటాయి? ఇవి ఉగాది పూజలా లేక క్షుద్ర పూజలా?” అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.

లోకేష్ వివరణ.. మ‌ళ్లీ దొరికిపోయాడా?
ఈ వివాదం ముదరడంతో లోకేష్ స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు. “అది క్షుద్రపూజల బొమ్మ కాదు.. నా కుమారుడు దేవాన్ష్ (Devansh) నాలుగేళ్ల వయసులో చేసిన శివుడి బొమ్మ (Lord Shiva Idol) ” అని వివరణ ఇచ్చారు. ఆ బొమ్మకు పైన నెలవంక కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నిన్న లోకేష్ విడుదల చేసిన అసలు ఫోటోలోని బొమ్మకు ఎక్కడా నెలవంక (Crescent Moon) కనిపించలేదు. కానీ, ఈరోజు వివరణ ఇస్తూ పెట్టిన ఫోటోలో మాత్రం ఆ బొమ్మపై నెలవంక స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో లోకేష్ రాత్రికి రాత్రే ఆ బొమ్మకు నెలవంక తగిలించి ఫోటో తీశారని, తప్పును కప్పిపుచ్చుకోవడానికి ‘కవర్ డ్రైవ్’ చేస్తున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

పాత జ్ఞాపకాలు.. మళ్ళీ అనుమానాలు!
గతంలో 2014-19 మధ్య టీడీపీ అధికారంలో (TDP Government) ఉన్న సమయంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో (Kanaka Durga Temple) అర్ధ‌రాత్రి క్షుద్రపూజలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ లోకేష్ త‌న ఇంట్లోని పూజగదిలోనే అటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటూ నెటిజన్ల అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి, ఉగాది శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి.. ఈ ‘బొమ్మ’ వివాదంతో లోకేష్ నెటిజ‌న్ల‌కు అడ్డంగా బుక్క‌య్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment