అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనతో మరోసారి వార్తల్లో నిలిచారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో చేసిన ప్రకటనతో ట్రంప్ గ్రీన్ ల్యాండ్ దీవిని కొనుగోలు చేయాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆశిస్తున్నట్లు తెలిపారు.
డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ ల్యాండ్ ప్రస్తుతం స్వయం పాలన కలిగిన ప్రాంతంగా ఉంది. దాని భౌగోళిక ప్రాముఖ్యత, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దానిని అమెరికా నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ట్రంప్ తన ఉద్దేశాన్ని వెల్లడించారు. గ్రీన్ ల్యాండ్ యాజమాన్యం అమెరికా భద్రతకు అత్యవసరమైంది అంటూ ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయవాదం నుంచి గ్లోబల్ ప్రణాళికల వరకు
గతంలో కూడా జాతీయవాద దృక్పథంతో ప్రసిద్ధి పొందిన ట్రంప్, తన “అమెరికా ఫస్ట్” నినాదంతో ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికా ఆర్థికాభివృద్ధి, భౌగోళిక బలోపేతంపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టమైంది. పనామా కాలువపై నియంత్రణ సాధించేందుకు ట్రంప్ తాజా ప్రకటన గ్రీన్ ల్యాండ్ కొనుగోలు చేయడం చుట్టూ మరిన్ని చర్చలకు దారితీస్తోంది.
గ్రీన్ ల్యాండ్ కొనుగోలు యత్నం చరిత్రలో సంచలన పరిణామంగా మిగిలిపోతుందా లేక మరొక వివాదానికి నాంది అవుతుందా అనేది చూడాలి.